తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి - ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అఖిల ఉదయం కళాశాలకు వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇంటర్​ విద్యార్థిని

By

Published : Jul 25, 2019, 4:30 PM IST

Updated : Jul 26, 2019, 7:00 AM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంచాల మండలం బోదకొండకు చెందిన ఆమె ఎప్పటిలానే ఈరోజు కూడా కళాశాలకు వెళ్లింది. ఉదయం శౌచాలయానికి​ వెళ్లి స్పృహ తప్పి పడిపోయింది. యాజమాన్యం విద్యార్థినిని నగరంలోని గ్లోబల్​ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Last Updated : Jul 26, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details