తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్‌ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన - Inter-evaluation faculty

ఇంటర్​ ముల్యాంకనం చేసే అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల మూల్యాంకనానికి వెళ్లే ప్రత్యేక బస్సులను ఆపేశారు. నగర శివార్లలోకి వెళ్లాలంటే.. ప్రైవేటు వాహనాల ఛార్జీలు తట్టుకోలేమంటూ... అధ్యాపకులు ఆందోళన చేపట్టారు.

Inter-evaluation faculty protest for special buses in rangareddy district
బస్సుల కోసం ఇంటర్‌ మూల్యాంకం చేసే అధ్యాపకుల ఆందోళన

By

Published : May 20, 2020, 10:40 AM IST

ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల ఇంటర్ మూల్యాంకనానికి వెళ్లే అధ్యాపకుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు కేవలం నగర శివార్లలోకే వెళ్తుండడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని... ఆ ఛార్జీలు తట్టుకోలేమని అధ్యాపకులు వాపోతున్నారు.

తాండూరు, వికారాబాద్, పరిగి నుంచి వచ్చే అధ్యాపకులు దాదాపుగా 300 మంది గంటల తరబడి చేవెళ్ల బస్టాండ్‌లో వేచి ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డ్ అధికారులు స్పందించి తమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details