రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు బాలాజీ దేవాలయంలో కరోనా వైరస్ రాకుండా ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వైరస్ ప్రజలకు సోకకుండా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులపై చల్లారు.
చిలుకూరు ఆలయంలో.. కరోనా రాకుండా పూజలు - rangareddy district latest news today
మొయినాబాద్ చిలుకూరు బాలాజీ దేవాలయంలో కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా ఉండాలని ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
చిలుకూరు ఆలయంలో.. కరోనా రాకుండా పూజలు
చిలుకూరు బాలాజీ స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉంటాయని అర్చకులు అన్నారు. రైతుల ఆత్మహత్యలు, హత్యాచారాలు, దిశా ఉదంతం ఇలా అనేక ఘటనలపై స్వామి ఆశీస్సులతో తాము పోరాడామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి :మరో పోరాటానికి సిద్ధం కండి