రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో ఇప్పటికీ 20 శాతం ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ జి.పి.కుమార్, సిబ్బంది కృషితో వరదల కారణంగా మునిగిపోయిన 350 ఇళ్లలోని నీటిని అధికారులు బయటకు పంపించారు.
ఇప్పటికీ వరద నీటిలోనే 20 శాతం ఇళ్లు - జల్పల్లిలో వరద నీటిలో ఇళ్లు
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదల్లో చిక్కుకుపోయిన ఇళ్లలోనుంచి నీటిని తరలించడానికి మున్సిపల్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

canal
మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లలో వరద నీటి సమస్య పరిష్కారం కొరకు చెరువు నుంచి తూము ద్వారా అధికారులు భారీ కాల్వ ఏర్పాటు చేశారు. పైప్ లైన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నీటిని బయటకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మరో వారంలో నీటిలో ఉన్న 20శాతం ఇళ్ల బయటకు తీసుకొస్తామని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జి.పి.కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు
Last Updated : Jan 7, 2021, 12:20 PM IST