రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్‌పల్లిలో సినీ హీరో, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని బన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా, ఈ భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం ఆయన శంకర్‌పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. మరోవైపు, బన్నీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు ఎమ్మార్వో కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనతో ఫొటోలు తీసుకున్నారు.
Alluarjun in MRO office: ఎమ్మార్వో ఆఫీసులో అల్లు అర్జున్.. ఎందుకొచ్చారంటే? - allu arjun latest news
సినిమాలు, షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే.. హీరో అల్లు అర్జున్ (ALLU ARJUN) రంగారెడ్డి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అసలు బన్నీకి ఎమ్మార్వో ఆఫీసులో ఏం పని.. అనుకుంటున్నారా? లేదా సినిమా షూటింగ్లో భాగంగా అక్కడికి వచ్చారా? తెలుసుకోవాలంటే... ఓసారి ఈ కథనంపై లుక్ వేయండి.
Alluarjun News: ఎమ్మార్వో ఆఫీసులో అల్లు అర్జున్.. ఎందుకొచ్చారంటే?
అభిమాన హీరోను చూడటానికి జనాలు భారీ సంఖ్యలో తహసీల్దార్ ఆఫీస్ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. మరోవైపు గతంలో ఎన్టీఆర్ కూడా భూ రిజిస్ట్రేషన్ పనుల కోసం శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: