తెరాస ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. 265మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'ప్రభుత్వం ప్రతి ఇంటికి అండగా నిలుస్తోంది' - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'ప్రభుత్వం ప్రతి ఇంటికి అండగా నిలుస్తోంది'
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. బడుగుబలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.
ఇదీ చదవండి:'ప్రజలకు పథకాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి'