రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు సేవా సహకార సంఘం 44వ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం రైతుబంధు అందజేస్తోందని ఆయన అన్నారు.
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది' - రైతుబంధు వార్తలు
రైతులను ఆదుకోవడం కోసం సర్కారు రైతుబంధు అందజేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని రైతులందరిని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. రైతు సేవా సహకార సంఘం ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందేటట్లు చూడాలని అన్నారు.
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
ఇదీ చూడండి: ఐదో తరగతి వరకు బడులుండవ్..!