తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాళ్లందరూ సేఫ్​.. ఎలాంటి ప్రాణాపాయం లేదు..' - Ibrahimpatnam incident latest news

Ibrahimpatnam Incident News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 19 మంది, అపోలో ఆసుపత్రిలో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం

By

Published : Aug 31, 2022, 3:50 PM IST

Updated : Aug 31, 2022, 4:49 PM IST

Ibrahimpatnam Incident News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత నలుగురు చనిపోవటంతో.. మంగళవారం మిగతావారిని అపోలోకు 11 మంది, నిమ్స్‌కు 19మందిని తరలించారు. మహిళలకు శస్త్రచికిత్స చేసిన భాగంలో ఇన్ఫెక్షన్ తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు కొంత బలహీనంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బాధిత మహిళల కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండ్రోజుల్లో అందరినీ డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. మృతిచెందిన వారి పోస్ట్​మార్టం నివేదికలు రేపు ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. ఈ నివేదికల ఆధారంగా వైద్యారోగ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అసలేెం జరిగిదంటే: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. మరొకరు సోమవారం ఉదయం చనిపోయారు. పరిస్థితి విషమించిన లావణ్య, మౌనికలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.

Last Updated : Aug 31, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details