తెలంగాణ

telangana

ETV Bharat / state

రియల్టర్ల హత్య కేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ సస్పెండ్ - రియల్టర్ల హత్య కేసు న్యూస్

Ibrahimpatnam ACP Suspended : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసులో ఓ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేసి అంతర్గత విచారణ చేయించారు. నివేదిక ఆధారంగా ఇవాళ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Ibrahimpatnam ACP Suspended
Ibrahimpatnam ACP Suspended

By

Published : Apr 23, 2022, 12:11 PM IST

Ibrahimpatnam ACP Suspended : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నెంగూడ వద్ద గత నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందారు. మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మట్టారెడ్డితో పాటు పోలీసులు... ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Realtors Murder Case Update : ఈ కేసులో బాధ్యులను చేస్తూ ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేశారు. ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలతో అధికారులు అతనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత కథనాలు :

ABOUT THE AUTHOR

...view details