తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Girl Killed in UK : లండన్​లో హైదరాబాద్ యువతి హత్య - తేజస్విని పూర్తి వివరాలు

Hyderabad Girl Killed in London : ఉన్నత చదువులు చదివేందుకు లండన్​ వెళ్లిన ఓ తెలుగు యువతిపై విదేశీ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతి మృతి చెందింది. ఆమెకు సాయం చేసేందుకు వెళ్లిన స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 14, 2023, 1:55 PM IST

Hyderabad Girl Murder in London : యువతీ, యువకులు ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళుతున్నారు. అందులో ఎక్కువగా అమెరికా, లండన్​.. తదితర దేశాలను ఎంచుకుంటున్నారు. విద్యను నేర్చుకునే క్రమంలో అదే దేశంలో ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తి చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించి.. ఒత్తిడిని తట్టుకొని ముందుకు సాగుతున్నారు. కొంత మంది అనుకోని పరిస్థితుల్లో మృతి చెందుతున్నారు. అలానే ఓ తెలుగు యువతి తన కోర్సు పూర్తి చేసుకొని.. మరికొన్ని రోజుల్లో ఇంటికి వచ్చే సమయంలో ఆమెపై ఓ విదేశీ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి(27) మూడు సంవత్సరాల క్రితం లండన్​లో ఎంఎస్​ చేసేందుకు వెళ్లింది. రెండు నెలల క్రితమే ఆ కోర్సు పూర్తి చేసుకుంది. గత నెల ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. కొన్ని కారణాల దృష్ట్యా ఆమె రాలేక పోయింది. ఈ నెల చివరి వారంలో వచ్చేందుకు సిద్ధం అయింది.

Hyderabad Girl Tejaswini Murder in UK :లండన్​లో తన మిత్రులతో కలిసి ఓ ఫ్లాట్​లో నివసిస్తోంది తేజస్విని. అందులో అమ్మాయిలు.. అబ్బాయిలూ కలిసి ఉంటున్నారు. తన ఫ్లాట్​మేట్స్​లో బ్రెజిల్​కు చెందిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లూ.. వీళ్లంతా కలిసి హాయిగా.. జాలీగా గడిపారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. తేజస్వినిపై బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని మృతి చెందింది. అతడిని అడ్డుకోబోయిన తేజస్విని స్నేహితురాలిపై కూడా దాడికి తెగబడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని... బ్రెజిల్ యువకుడిని అరెస్టు చేశారు.

తేజస్విని చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఇండియాకు వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని.. ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతుందని ఊహించలేదని గుండెలవిసేలో రోదిస్తున్నారు. తేజస్వినికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామని తెలిపారు. తమ కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాడు తేజస్విని తల్లిదండ్రులు.

"మూడు సంవత్సరాల క్రితం నా కుమార్తె ఎంఎస్ చేయడానికి వెళ్లింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఈ సందర్భంగా .. ఈ నెల చివరి వారంలో ఇంటికి వస్తానని చెప్పింది. ఈ లోపే తను మృతి చెందిన వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. వీలైంత తొందరగా నా కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాల్సిందగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను." - తేజస్విని రెడ్డి తండ్రి

Aishwarya murder case: ఇటీవలే అమెరికాలో ఓ యువకుడు విచక్షణా రహితంగా చేసిన కాల్పుల్లో హైదరాబాద్​కి చెందిన తాటికొండ ఐశ్వర్య(27) మృతి చెందింది. ప్రాజెక్ట్​ మేనేజర్​గా వర్క్​ చేసేందుకు వెళ్లింది. అక్కడ ఆమె షాపింగ్​ చేస్తున్న క్రమంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించారు. అందులో ఐశ్వర్య ఒకరు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details