తెలంగాణ

telangana

ETV Bharat / state

పది ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ... పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాడు ఇబ్రహీంపట్నానికి చెందిన స్మరణ్​. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నారని తెలిపాడు.

పదిలో సత్తా చాటిన విద్యార్థి

By

Published : May 13, 2019, 5:34 PM IST

పదో తరగతి ఫలితాల్లో ఇబ్రహీంపట్నానికి చెందిన స్మరణ్​ సత్తా చాటాడు. రంగారెడ్డి జిల్లా బొంగుళూరులోని తెలంగాణ స్టేట్​ మోడల్​ స్కూల్​లో చదివి పదికి పది పాయింట్లు సాధించాడు. ఇతని తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి సత్యం కలెక్టర్​ కార్యాలయంలో గుమస్తా కాగా... తల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తమ ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. పెద్ద కుమారుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఇప్పుడు ఐఐఐటీ బాసరలో ఇంజినీరింగ్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

పదిలో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థి

నాణ్యమైన విద్య లభిస్తుంది

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా బోధన ఉంటుందని స్మరణ్​ తెలిపాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయం సాధించానని అన్నాడు. ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే తమ కుమారుడు పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాడని స్మరణ్​ తల్లిదండ్రులు తెలిపారు. మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : పదో తరగతి ఫలితాల్లో బాలికల ముందంజ

ABOUT THE AUTHOR

...view details