తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడిసెవాసుల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. - Hut dwellers Initiation

Hut dwellers Initiation in Abdullahpurmet: అబ్దుల్లాపూర్​మెట్ మండల కేంద్రంలో తహసీల్దార్​ కార్యాలయం ముందు గుడిసెవాసులు చేస్తోన్న దీక్షకి తెలంగాణ రాష్ట్ర, ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్యలు మద్దతు తెలిపారు.

cpm
cpm

By

Published : Nov 26, 2022, 8:16 PM IST

Hut dwellers Initiation in Abdullahpurmet: గుడిసెలు వేసుకున్న వారు రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలలో రాష్ట్ర ప్రజాసంఘాల వేదిక కార్యదర్శి ఎస్.వీరయ్య మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీరు చేస్తున్న పోరాటం న్యాయమైందని, అన్నారు. ఈ భూమి ఎవరిజాగీరు కాదని.. ప్రభుత్వ భూమిపై పేదలకు హక్కుంటుందని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఆ భూమిలోనే గుడిసెలు వేసుకోవాలని, మీకు ఎల్లవేళలా మా మద్దతు ఉంటుందని తెలిపారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు జాన్​వెస్లీ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఆ భూమిని పేదలకు ఇచ్చేంతవరకు వదిలేది లేదని, హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు 60 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కావున తెలంగాణ ప్రభుత్వం 493జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పడాల యాదయ్య, సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details