తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య కాపురానికి రావడం లేదని.. బావమరిది, అతని భార్య కిడ్నాప్‌ - ఆదిభట్లలో భార్య కిడ్నాప్​కు ప్రయత్నం

kidnap drama for wife in Rangareddy : భార్యను కాపురానికి రప్పించడానికి కిడ్నాప్ నాటకానికి తెర తీయాలనుకున్నాడు ఓ భర్త. అతడి ప్లాన్​ను పసిగట్టిన భార్య ముందస్తుగా పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ప్లాన్​లో చిన్న ఛేంజ్ చేసి బావమరిదిని అతని భార్యను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

kidnap drama for wife
భార్య కాపురానికి రావడం లేదని..

By

Published : Jan 11, 2023, 10:34 AM IST

Updated : Jan 11, 2023, 4:27 PM IST

kidnap drama for wife in Rangareddy : భార్య కాపురానికి రాలేదని ఆగ్రహించిన భర్త బావమరిదిని అతని భార్యను అపహరించాడు. ఆదిభట్ల పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ముడావత్‌ జగ్య, దేవి దంపతుల కుమార్తె విజయ(28)కు నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాలకు చెందిన పెయింటర్‌ కేతావత్‌ శంకర్‌తో 13 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. నాదర్‌గుల్‌లో నివసించేవారు. కొన్ని రోజులుగా వీరిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి.

దీంతో విజయ పుట్టింటికి, శంకర్‌ లింగాలకు వెళ్లిపోయారు. ఈ నెల 5న శంకర్‌ కొందరితో వచ్చి అత్తగారింటిపై దాడి చేశాడు. అప్పుడు జగ్య తలకు గాయమైంది. మళ్లీ మంగళవారం ఇంట్లో ఉన్న వాళ్లందరినీ కిడ్నాప్‌ చేయడానికి లింగాల నుంచి రెండు తుఫాన్‌ వాహనాల్లో బయలుదేరాడు. బంధువుల ద్వారా విషయం విజయకు తెలిసి, తండ్రి జగ్యతో కలిసి ఆదిభట్ల ఠాణాకు వెళ్లి సమాచారం ఇచ్చింది. విషయం శంకర్‌కు తెలిసి, నాదర్‌గుల్‌లో కూలి పనికి వెళ్లిన బావమరిది కృష్ణ అతని భార్య పద్మను కిడ్నాప్‌ చేసి, లింగాలకు వెళ్లి భార్యకు ఫోన్‌ చేశాడు. తన వద్దకు రావాలని బెదిరించాడు.

''5వ తేదీన నా భర్త దాడి చేశాడని ఠాణాలో ఫిర్యాదు చేశాం. మంగళవారం మళ్లీ వస్తున్నారని తెలిసి మధ్యాహ్నం నేను, మా నాన్న ఠాణాకు వెళ్లి విషయం చెప్పాం. పోలీసులు పట్టించుకోలేదు''. - విజయ

కృష్ణ, పద్మలకు అపాయం లేదు..అపహరణకు గురైన కృష్ణ, పద్మ దంపతులకు అపాయం లేదని ఆదిభట్ల పోలీసులు కుటుంబ సభ్యులకు వివరించారు. వారితో ఫోన్‌లో మాట్లాడించారు. నిందితులను లింగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

Last Updated : Jan 11, 2023, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details