తెలంగాణ

telangana

ETV Bharat / state

asha workers: 'ఆశావర్కర్ల సేవలు చాలా కీలకం' - ఆశావర్కర్ల సేవలు కీలకం

ఆశావర్కర్ల సేవలు చాలా కీలకమైనవని భాజపా తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పురపాలికలో ఆశా వర్కర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

honor to asha workers
asha workers: 'ఆశావర్కర్ల సేవలు చాలా కీలకం'

By

Published : Jun 5, 2021, 8:58 PM IST

గ్రామీణులు, పుర వాసుల ఆరోగ్య పరిరక్షణకు ఆశా వర్కర్లు చేస్తున్న కృషి గర్వించదగినదని భాజపా తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పురపాలికలోని జానంపేట గాంధీచౌక్ వద్ద భాజపా పురపాలిక అధ్యక్షులు మఠం రుషికేశ్​, యువ మోర్చా నాయకులు అందెల సందీప్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సన్మానం చేశారు.

కొవిడ్​ కట్టడి కోసం ఆశా వర్కర్లు చేసిన సేవలను వారు కొనియాడారు. ఆశా వర్కర్లకు తగిన వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సీనియర్ నాయకులు వెంకటేశ్​, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మురళి, యువ మోర్చా రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ, గిరిజన మోర్చా అధికార ప్రతినిధి వినోద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కురుమయ్య, గజ్జల ప్రవీణ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Corona: గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!

ABOUT THE AUTHOR

...view details