తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాఫిక్​ కానిస్టేబుల్​ను చితకబాదిన వాహన చోదకుడు - Shamshabad news

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గగన్​పహడ్​ వద్ద వాహనదారుడు, హోంగార్డ్ కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న పొలీసులు ఇరువురిని పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

రోడ్డుపై వాహనదారుడు, హోంగార్డ్ కుస్తీ
రోడ్డుపై వాహనదారుడు, హోంగార్డ్ కుస్తీ

By

Published : Dec 14, 2020, 5:39 PM IST

రోడ్డుపై వాహనదారుడు, హోంగార్డ్ కుస్తీ

వాహనదారుడితో నడిరోడ్డుపై ట్రాఫిక్ హోంగార్డ్ కుస్తీలు పట్టిన ఘటన శంషాబాద్ పరిధిలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గగన్​పహడ్​కు చెందిన మధుకుమార్ బైక్​పై గగన్​పహడ్ నుంచి కాటేదాన్ వెళ్లేందుకు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి వస్తుండగా రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ బైక్ ఫొటో తీశాడు.

మధుకుమార్ హోంగార్డు వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించగా ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఇంతలో హోంగార్డు బైక్ తాళాలు తీసుకుంటుండగా... మధుకుమార్ బైక్ తాళాలు ఎందుకు తీసుకుంటున్నావని అడగగా... హోంగార్డ్ చేయి చేసుకున్నాడు. ఇద్దరు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పొలీసులు ఇరువురిని పోలీసుస్టేషన్​కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:'రైతు ధైర్యంగా అడుగేయనంతవరకు ప్రపంచంతో పోటీ పడలేం'

ABOUT THE AUTHOR

...view details