తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2019, 2:51 PM IST

ETV Bharat / state

శంషాబాద్​ మున్సిపల్​ ఎన్నికలపై హైకోర్టు స్టే

శంషాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. మున్సిపాల్టీలో ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియ సరిగ్గా జరిగేవరకు ఎన్నికలు నిర్వహించవద్దని ఆదేశించింది.

high court stay on shamshabad muncipal elections due to local members petition

శంషాబాద్​ మున్సిపాలిటీలో ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియ చట్ట ప్రకారం జరగలేదని స్థానికులు కోడె సిద్ధులు, శ్రీనివాస్, గోపాల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన సరిగ్గా జరిగే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దని ఆదేశించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details