తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్ని కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిలిపివేత.. ఆ తేదీ వరకు ఆన్​లైన్​లోనే - కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిలిపివేత

high court orders to stop direct hearings
కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిలిపివేత

By

Published : Jan 17, 2022, 3:52 PM IST

Updated : Jan 17, 2022, 4:12 PM IST

15:48 January 17

Direct hearings stopped in Courts: రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిలిపివేత

Direct hearings stopped in Courts: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో న్యాయస్థానాల విధుల నిర్వహణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో తక్షణమే ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4 వరకు ఆన్​లైన్​లోనే కోర్టుల నిర్వహణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టులో కూడా అన్ని బెంచ్​లు ఆన్​లైన్​లోనే కేసుల విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా న్యాయాధికారులకు హైకోర్టు తెలిపింది.

ఇదీ చదవండి:ప్రారంభరోజే వాయిదా పడిన రిమ్స్​ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి... ఎందుకంటే?

Last Updated : Jan 17, 2022, 4:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details