తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాయదుర్గం భూకేటాయింపులపై ప్రభుత్వం, మైహోంకు నోటీసులు' - revanth reddy case on raidurg land allocation

రాయదుర్గం భూకేటాయింపులపై ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. 31.35 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మై హోం సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ, డీఎల్ఎఫ్, మై హోం సంస్థకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు... విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

high court
high court

By

Published : Feb 10, 2020, 5:24 PM IST

మైహోం కన్ స్ట్రక్షన్స్​కు లబ్ధి చేకూరేలా నిబంధనలకు విరుద్ధంగా రాయదుర్గంలో భూకేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీ, డీఎల్ఎఫ్, మైం హోం కన్​స్ట్రక్షన్స్​కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

విలువైన భూమి ఇచ్చారు!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 31 ఎకరాల 35 గుంటల భూమిని డెవలప్ చేసేందుకు డీఎల్ఎఫ్ రాయ్ దుర్గ్ డెవలపర్స్ సంస్థ బిడ్ దాఖలు చేయగా... దానిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయిచారని పిటిషన్​లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత డీఎల్ఎఫ్ రాయ్ దుర్గ్ డెవలపర్స్ పేరును ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్​గా మార్చుకోవడానికి అనుమతినిచ్చారని తెలిపారు. కేటాయించిన భూమికి బదులుగా సమీపంలోని అంతకన్నా విలువైన మరో భూమిని ఇవ్వాలని ఆక్వా స్పేస్ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని పేర్కొన్నారు.

విచారణ నాలుగు వారాలకు వాయిదా

ఆక్వా స్పేస్ కంపెనీ ప్రభుత్వ పెద్దలతో సన్నిహత సంబంధాలున్న మై హోం గ్రూప్ సంస్థది కావడంతో.. అక్రమంగా భూమి కేటాయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూకేటాయింపులు రద్దు చేయడంతో పాటు.. సంబంధిత అధికారులపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్​లో కోరారు. భూములపై యథాతథ స్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఆరేళ్లలో తెలంగాణకు రూ.85,013 కోట్లు ఇచ్చాం: నిర్మల

ABOUT THE AUTHOR

...view details