తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం వివరాలేవి?: హైకోర్టు

High Court on Covid Cases: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పరిహారం చెల్లింపు వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.

hc on covid cases
కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

By

Published : Feb 28, 2022, 8:02 PM IST

High Court on Covid Cases: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వివరాలు సమర్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని.. పాజిటివిటీ రేటు సుమారు 1శాతం ఉందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు.. హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు.

హైకోర్టు సంతృప్తి

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు సర్కారు చేపట్టిన చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వివరాలను సమర్పించేందుకు 6 వారాల గడువు కావాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్​ ప్రసాద్ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. కొవిడ్​కు సంబంధించి కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది.

ఇదీ చదవండి:Telangana Budget Sessions 2022-23 : మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details