తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా హిమాయత్‌సాగర్ జలాశయం.. గేట్లు ఎత్తే అవకాశం! - తెలంగాణ వార్తలు

ఇటీవల కురిసిన వర్షాలకు హిమాయత్​సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. భారీ వరద ప్రవాహంతో జలకళను సంతరించుకుంది. జలాశయంలోకి 2,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

water flow to himayat sagar, himayat sagar water levels
హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం, నిండు కుండలా హిమాయత్ సాగర్ జలాశయం

By

Published : Jul 20, 2021, 12:55 PM IST

Updated : Jul 20, 2021, 2:01 PM IST

రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. జలాశయంలోకి వరదనీరు 1762.80 అడుగులకు వచ్చి చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1763.00 అడుగుల స్థాయికి చేరుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాక ఎప్పుడైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని జలమండలి ఎండీ వెల్లడించారు. సంబంధిత రెవెన్యూ అధికారులను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు.

హిమాయ‌త్ సాగ‌ర్ లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న కాల‌నీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంత ప్రజ‌ల‌ను వెంట‌నే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టేందుకు సన్నద్ధం కావాల‌ని హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను జలమండలి ఎండీ ఆదేశించారు. హిమాయత్ సాగర్‌లోకి నీరు అధికంగా రావడంతో సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

హిమాయత్‌సాగర్

  • గరిష్ఠ నీటిమట్టం-1763.50 అడుగులు
  • ప్రస్తుత నీటిమట్టం-1762.80 అడుగులు

ఉస్మాన్‌సాగర్ జలాశయం

  • గరిష్ఠ నీటిమట్టం-1790 అడుగులు
  • ప్రస్తుత నీటిమట్టం-1784.60 అడుగులు

ఇదీ చదవండి:Warning : మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ

Last Updated : Jul 20, 2021, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details