రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా ఈ నెల 29 వరకూ తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం అత్యధికంగా భోరజ్(ఆదిలాబాద్ జిల్లా)లో 46.3, కొల్లూరు(కామారెడ్డి), జన్నారం(మంచిర్యాల)లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
'మే 29 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం
మే 29 వరకు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కన్నా 6 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎండల వల్ల పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
'మే 29 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
సాధారణం కన్నా 6 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వడగాలులు వీస్తున్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో ఎండల తీవ్రత వల్ల పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.