తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బారినపడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి - తెలంగాణ వార్తలు

మోండా మార్కెట్​లో విధులు నిర్వహిస్తున్న హెడ్​ కానిస్టేబుల్​కు గత నెల 19వ తేదీన కరోనా సోకింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన... లక్షణాలు తీవ్రం అవటంతో మృతి చెందారు.

head constable died of a corona infection
కరోనా బారినపడి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

By

Published : Apr 9, 2021, 3:54 PM IST

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని బాలాజీనగర్‌లో కరోనా బారిన పడి ఓ హెడ్‌ కానిస్డేబుల్‌ మృతి చెందాడు. మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హసన్‌ అలీకి... గత నెల 19వ తేదీన కొవిడ్‌ పాజిటివ్​గా తేలింది. అమీర్​పేట్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో లక్షణాలు తీవ్రం కావటంతో చికిత్స పొందుతూ.. ఇవాళ మరణించారు. హసన్​ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలీ మృతితో పోలీస్​స్టేషన్​లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి:'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

ABOUT THE AUTHOR

...view details