Hayatnagar Rajesh Murder Case Latest Update : హైదరాబాద్ శివారు పెద్దఅంబర్‌పేటలో కలకలం రేపిన యువకుడి మృతదేహం లభ్యమైన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పెద్ద అంబర్‌పేట్ వద్ద డాక్టర్స్ కాలనీ సమీపంలో... పంచోత్కులపల్లికి చెందిన యువకుడు రాజేశ్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. అయితే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే రాజేశ్‌ను హత్య చేసినట్లు భావించిన పోలీసులు... ఆ దిశగా విచారణ చేపట్టారు.
Kuntloor Rajesh murder Update :హయత్‌నగర్‌లో రాజేశ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజేశ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్ సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉపాధ్యాయురాలి భర్తకు తెలవడంతో ఆమెను మందలించాడు. దీంతో తాను చనిపోతానని ఉపాధ్యాయురాలు రాజేశ్ కు వాట్సాప్ సందేశం పంపి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే అప్పటి నుంచి రాజేశ్ ముభావంగా ఉంటున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది.
Rajesh Murder Case Latest news :ఈ క్రమంలో రాజేశ్ మృతదేహాం లభించడంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుందనే బాధతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా.... లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రాథమికంగా రాజేశ్‌ను టీచర్ భర్త నాగేశ్వర్‌రావు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాగేశ్వర్‌రావు, ఆయన బంధువులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో రాజేశ్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు గందరగోళానికి గురవుతున్నారు.