జలమండలి పంప్‌హౌజ్‌లు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని జలమండలి ఎండీ దానకిశోర్ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా హిమాయత్‌సాగర్ గార్డెన్లో ఆయన మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రజలందరూ తీసుకోవాలని సూచించారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన దానకిశోర్ - harithaharam at jalamandali in hyderabad
రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ గార్డెన్లో జలమండలి ఎండీ దానకిశోర్ ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. జలమండలి పంప్‌హౌజ్‌లు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ఆయన అధికారులను ఆదేశించారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన దానకిశోర్
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే ప్రసిద్ధ జపాన్ బొటానిస్ట్ అకీరా మియావాకీ టెక్నిక్‌తో మొక్కలు నాటాలన్నారు. ఇలాంటి మొక్కలు ఒక హెక్టార్ విస్తీర్ణంలో 14 రకాలకు చెందిన పదివేల మొక్కలను నాటేలా ఎండీ దానకిశోర్ చర్యలు తీసుకున్నారు.