తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. కాంగ్రెస్‌, బీజేపీ కావాలా?' - హరీశ్ రావు కామెంట్స్

Harish Rao Tour in Rangareddy District : నీతి అయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానాన్ని చేరుకుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత వేగంగా అభివృద్ధి చెందిందని.. ఇటీవలే తమిళ కథానాయకుడు హైదరాబాద్​ను​ చూస్తే న్యూయార్క్​లా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

Harish Rao Fire on BJP
Harish Rao Comments on Congress

By

Published : Aug 17, 2023, 4:38 PM IST

Harish Rao Tour in Rangareddy District: రూ.4.5 కోట్లతో తహశీల్దార్, ఆర్డీవో భవనాలు నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌కు మంత్రి హరీశ్​రావు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని బొంగుళూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తహశీల్దార్, ఆర్డీవో భవనాలు రూ.4.5 కోట్లతో నిర్మించిన.. రామోజీ ఫౌండేషన్​ ఛైర్మన్​ రామోజీరావు(Ramoji Rao)కి ప్రభుత్వం తరుఫున కృతజ్ఞతలు చెప్పారు. బాధితుల పక్షాన నిలవడంలో ఈనాడు, ఈటీవీ అనుబంధ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని ప్రసంశించారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు.

Telangana 3rd Rank in Niti Aayog : తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. నీతి అయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానాన్ని చేరుకుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు సేవ చేసే నాయకులు బీఆర్​ఎస్​లో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఎన్నో వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు. కేసీఆర్ మరోసారి సీఎంకావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు.

Harish Rao on Rythu Bhima Scheme : రైతు పక్షపాతి కేసీఆర్.. రైతు బీమాకు ఐదేళ్లు పూర్తి​ : హరీశ్​రావు

Harish Rao Comments on BJP and Congress Parties : రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని తెలిపారు. తొమ్మిదేళ్లలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్​లో సందర్శించిన ప్రముఖ తమిళ కథానాయకుడు రజనీకాంత్(RajiniKanth).. హైదరాబాద్​ను చూస్తే న్యూయార్క్​లా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న వైద్యశాలను వంద పడకల ఆస్పత్రిగా చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలుచేశారు. కాంగ్రెస్​ పార్టీ గెలిచినా.. కర్ణాటకలో కరెంట్​ కోతలు ఉన్నాయని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ 3 నల్ల చట్టాలు తెచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

"కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన కర్ణాటకలో కరెంటు కోతలు ఉన్నాయి. బెంగళూరులో కూడా కరెంటు కోతలు తప్పట్లేదు. రాష్ట్రంలో బీఆర్​ఎస్ పార్టీ మాత్రమే 24 గంటల కరెంటు ఇస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం 3 గంటల కరెంటు చాలని అంటుంది. మీటర్లు కావాలా.. 3 గంటలు కావాలా.. 3 పంటలు కావాలా?. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ 3 నల్ల చట్టాలు తెచ్చింది. దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. చీకటి కాంగ్రెస్‌, బీజేపీ కావాలా?. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రిని ఇస్తాం."- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

Harish Rao Speech మీటర్లు కావాలా.. 3 గంటలు కావాలా.. 3 పంటలు కావాలా అన్న హరీశ్​రావు

HarishRao Health Department Review : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం పట్ల హరీశ్‌రావు హర్షం

Harishrao Comments On CM KCR : 'ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు.. మన కేసీఆర్‌'

Harish Rao on Telangana Development : 'హెల్త్‌ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగాయి'

ABOUT THE AUTHOR

...view details