తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao in Kondapur hospital: వ్యాక్సినేషన్​లో అందరి భాగస్వామ్యం అవసరం: హరీశ్ రావు - కొండాపూర్​ ఆస్పత్రిలో హరీశ్ రావు

Harish rao in Kondapur hospital: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అదనపు పడకల సముదాయాన్ని హరీశ్‌ ప్రారంభించారు.

Harish rao in Kondapur hospital
వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

By

Published : Dec 8, 2021, 6:43 PM IST

Harish rao in Kondapur hospital: కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సీఎస్ఐఆర్​లో భాగంగా రహేజా కార్ప్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన 100 పడకల వార్డులను ఆయన ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 10 కోట్లు ఖర్చు చేసిన సంస్థ ప్రతినిధులను అభినందించారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అదనంగా 120 పడకలతో మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు.

మూడోదశ ఎదుర్కొనేందుకు సిద్ధం

harish rao on third wave: కొవిడ్ సమయంలో హైదరాబాద్​లో అప్పటికే అందుబాటులో ఉన్న పడకలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనంగా 1300 పడకలను ప్రైవేట్ సంస్థలు సీఎస్ఐఆర్ కింద సమకూర్చాయని హరీశ్ రావు తెలిపారు. మూడో దశ వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, డీఎంఈ రమేశ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ వేగం పెంచండి

harish rao on vaccination: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొవాలంటే జాగ్రత్తలతో పాటు టీకానే మార్గమన్నారు.

వ్యాక్సినేషన్​లో అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి కార్పొరేటర్లు అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలి. ఓట్ల కోసం ఎలాగైతే వెళ్తామో అలాగే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లండి. ఒక్కరు ఉన్నా కూడా అవగాహన కల్పించాలి. ఇవాళ మొదటి డోస్ 94 శాతం మంది తీసుకున్నారు. 49 సెకండ్ డోస్ తీసుకున్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే అందరి భాగస్వామ్యం అవసరం. ఒమిక్రాన్ ఇప్పటికైతే మన రాష్ట్రంలో లేదు. మనం భయపడాల్సిన అవసరం లేదు. -హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details