Harish Rao Inauguration Of CHC at Maheswaram :మరో వారం పదిరోజుల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మెడికల్ కళాశాల(Telangana Medical College)కు శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీనికి అనుబంధంగా 550 పడకలతో ఆస్పత్రి నిర్మాణం కూడా ఉంటుందన్న హరీశ్ రావు.. నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందున్నారు.
జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన హరీశ్ రావు(Harishrao).. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడారు.
ఎదిగిన నాయకురాలుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సబితా ఇంద్రారెడ్డి కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేశారని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగంలో ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. భారతదేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని.. చెరువుల అభివృద్ధిలో కర్ణాటక.. తెలంగాణను కాపీ కొడుతోందని హరీశ్‌రావు వెల్లడించారు.
- Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్ ఉంటుండగా.. కాంగ్రెస్, బీజేపీ కావాలా?'
Harish Rao Inauguration Development Works In Rangareddy : తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అనేలా కేసీఆర్ చేశారన్నారు. అలాగే రైతులకు ఉచిత కరెంటుపై అసత్యాలు పలుకుతున్న కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మూడు గంటల కరెంట్ కావాలాంటే కాంగ్రెస్‌కే ఓటు వేయాలని.. అదే 24 గంటలు కరెంట్ కావాలనుకుంటే మాత్రం కేసీఆర్‌కు మాత్రమే ఓటు వేయాలని సూచించారు.