Harish Rao Election Campaign at Rajendranagar: ఎన్నికలంటే ఐదొద్దుల పండుగ కాదు.. ఐదేళ్ల భవిష్యత్తని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హరీశ్ రావు కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీశ్ రావు.. ప్రకాశ్ గౌడ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మణికొండ ప్రాంతం గతంలో ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో స్థానికులు గమనించాలన్నారు. మణికొండలో నీళ్ల సమస్య అధికంగా ఉండేదని కేసీఆర్ వచ్చాక నీటి సమస్య లేకుండా చేశారని తెలియజేశారు. ఇప్పుడు ప్రజలకు నీళ్ల ట్యాంకులు కొనే పరిస్థితి తప్పిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయని.. జల మండలి దగ్గర ధర్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
'కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే - కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే'
BRS Election Campaign : రాష్ట్రంలో మంచి నీటి సమస్య లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా శుద్ధి చేసిన మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ వచ్చాక కరెంటు కష్టాలు కూడా తీరాయన్నారు. కర్ణాటకలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉందని తెలంగాణలో కర్ణాటక మోడల్ అంటే కోతలు పెట్టడమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ హయాంలో కత్తిపోట్లు, కర్ఫ్యూలే ఎక్కువ ఉండేవని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు.
సమైక్య వాదులంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారు : హరీశ్ రావు
ప్రకాశ్ గౌడ్ మూడుసార్లు గెలిచినా వీసమెత్తు గర్వం లేదని.. హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవదన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ వాళ్లందరు అబద్దాల కోరులు, కాంగ్రెస్ వాళ్లను నమ్మి ఓటేస్తే మోసపోతారని.. మహిళలంతా గంపగుత్తగా కేసీఆర్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఓడిపోయేవాళ్లు కూడా ముఖ్యమంత్రులే అని ఎద్దేవా చేశారు.
"ఎన్నికలంటే ఐదు రోజుల పండుగ కాదు.. ఐదేళ్ల భవిష్యత్తు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్ఎస్ పాలనలో కరెంట్, తాగు నీటి కష్టాలు తీరాయి. కాంగ్రెస్ హయంలో మూడు రోజులకు ఒక్కసారి మంచి నీళ్లు వచ్చేవి...ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఇంటికి శుద్ధి చేసి.. స్వచ్ఛమైన నీటిని అందించిన కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి."-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
Telangana Assembly Elections : తెలంగాణ కాంగ్రెస్ చేతుల్లో పడితే కుక్కలు చించిన విస్తరిలా అవుతుందని.. కాంగ్రెస్‌కు ఓటు వేసి రిస్క్‌లో పడొద్దని తెలిపారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ నిరుద్యోగులకు అబద్దాలు చెపుతున్నారని.. అదే బెంగళూరులో నిరుద్యోగులతో మీటింగ్ పెడితే తన్ని తరిమేస్తారని విమర్శించారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైందని? కర్ణాటకలో కొత్త గ్యారంటీ పక్కన పెడితే ఉన్నవి కూడా ఊడిపోయాయని తెలిపారు.
ఎన్నికలంటే ఐదొద్దుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్తు - కాంగ్రెస్‌కు ఓటు వేసి రిస్క్‌లో పడొద్దు : హరీశ్ రావు ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్ఎస్ - ఊరూరా రోడ్ షోలు, బహిరంగ సభలతో విస్తృతంగా ప్రజల్లోకి గులాబీ దళం
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం - పాపమంటే గోసపడతాం : హరీశ్‌రావు