Harish Rao Speech Ibrahimpatnam BRS Meeting ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్‌లు చేసినా.. హ్యాట్రిక్ బీఆర్ఎస్దే Harish Rao At Ibrahimpatnam BRS Meeting : ప్రతిపక్ష నాయకులు ఎన్ని ట్రిక్‌లు చేసినా.. మళ్లీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. ఇబ్రహీం పట్నంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ భరోసా(KCR Bhorasa) కార్డును ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
Harish Rao on Ibrahimpatnam Development :దేశానికే ఆదర్శంగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని.. సాగునీరు ఒకటే రావాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అది కూడా వస్తుందని హామీ ఇచ్చారు. మహేశ్వరం- ఇబ్రహీంపట్నం మధ్యలో 500 పడకల ఆసుపత్రి రాబోతుందని తెలిపారు.
Minister Harish Rao Review On Viral Fevers : 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం'
రైతుబంధు నిధులు ఆపాలని ఈసీకి కాంగ్రెస్(CONGRESS) ఫిర్యాదు చేసిందని హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం నిధులు ఆరేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని గుర్తు చేశారు. మరో విడత 3 వేల కోట్లు మిగిలి ఉన్నాయని.. ఈసీ అనుమతి ఇస్తే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. లేని పక్షంలో అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధుని ఆపాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని హరీశ్‌రావు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.
Minister Harish Rao Reacts on Raithu Bandhu : "కాంగ్రెస్ వచ్చిందంటే.. పథకాలకు ఇక రాంరాం"
'వ్యవసాయాన్ని దండగ చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ.. కరెంట్ 3 గంటలు మాత్రమే ఇస్తానన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్‌లు చేసినా.. బీఆర్ఎస్(BRS) హ్యాట్రిక్ కొడుతుంది. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్‌కు పోటీ వచ్చే సరైన నాయకుడు రాష్ట్రంలో లేడు. రాష్ట్రంలో అధికారం మారితే దీనస్థితిలోకి వెళ్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ ఆలోచించే విధంగా వారికి అవగాహన కల్పించాలి.'- హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి
Harish Rao Comments on Congress :కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద తప్ప ప్రజల మీద యావలేదని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదని పేర్కొన్నారు. కేసీఆర్ నిజంగా తన పగని చూపించి ఉంటే.. ప్రతిపక్ష నాయకులుఅందరూ ఎప్పుడో జైలుకు వెళ్లేవారని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని.. కంటి ముందు జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని హరీశ్ రావు ప్రజలను కోరారు. మరోసారి కేసీఆర్‌ను ఆశీర్వదించి.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Harish Rao Counter on Amit Shah Comments : 'కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ'
Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్‌రావు ఫైర్