రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న ప్రారంభించిన హస్తకళ బొమ్మలకొలువు నేటితో ముగిసింది. కార్తీకమాసంలో భాగంగా 5 రోజుల పాటు నిర్మహించిన ఈ బొమ్మల కొలువు నేటితో ముగిసిందని ఆలయ ఛైర్మన్ కె.లక్ష్మయ్య తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా జయ అనే భక్తురాలు ఈ బొమ్మల కొలువును నిర్వహిస్తున్నట్లు ఆలయ వైస్‌ఛైర్మన్ పాపారావు వివరించారు.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన హస్తకళ బొమ్మల కొలువు - Vanasthalipuram Latest News
వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న ప్రారంభమైన హస్తకళ బొమ్మల కొలువు కళావేదిక నేటితో ముగిసింది. కార్తీకమాసంలో భాగంగా 5 రోజుల పాటు నిర్వహించిన బొమ్మల కొలువు.. నేటితో ముగుస్తుందని ఆలయ ఛైర్మన్ కె.లక్ష్మయ్య తెలిపారు.
Handicraft Dolls Gallery
ఆలయంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస పద్మావతి కల్యాణం, బొమ్మల కొలువు ప్రదర్శనలు గత ఐదు రోజులుగా ఆలయానికి వచ్చిన ఎంతోమంది భక్తులు తిలకించి ఆనందించారని ఆయన తెలిపారు. అనంతరం హస్తకళ బొమ్మల కొలువు నిర్వాహకురాలైన జయను ఆలయ కమిటీ సత్కరించింది. ఈ కార్యక్రమంలో సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: