లాక్‌డౌన్‌తో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివేకానంద సేవా సమితి గుర్తించింది. వారికి సాయం చేయడం కోసం నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించింది.
వలస కార్మికులకు సరుకుల పంపిణీ - groceries distribution to migrant labors in Serilingampally
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్లోని వలస కూలీలకు వివేకానంద సేవా సమితి సాయంతో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![వలస కార్మికులకు సరుకుల పంపిణీ groceries distribution to migrant labors in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6958110-60-6958110-1587971982404.jpg)
వలస కార్మికులకు సరుకుల పంపిణీ
శేరిలింగంపల్లి, ఇందిరానగర్‌లోని వలస కార్మికులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రవీందర్, నవీన్, శ్రీధర్ పాల్గొన్నారు.