సరూర్నగర్ మండల కార్యాలయం వద్ద టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు, వలస కూలీలకు, దివ్యాంగులకు... బియ్యం, నిత్యావసరాలు అందించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి చేతుల మీదుగా 150 మందికి సరుకులు పంపిణీ చేశారు.
వలస కూలీలకు, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ సమయంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ముందుకువచ్చింది. 150 మందికి బియ్యం, నిత్యావసరాల అందించి ఉదారతను చాటుకుంది.
వలస కూలీలకు, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ
సేవా కార్యక్రమాల్లోనూ టీఎన్జీవో ముందుంటుందని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్, ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు.