రంగారెడ్డి జిల్లా బొడకొండ గ్రామ పరిధిలో ఇటుక బట్టి కేంద్రాల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులకు తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాలకుర్ల వెంకటేశ్(పీవీ గౌడ్) నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ అమలుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి నగేశ్, నాగరాజు ముదిరాజ్, ఈరమల్ల కాటం గౌడ్ పాల్గొన్నారు.
ఒడిశా వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ - migrants updates in state
ఇటుక బట్టి కేంద్రాల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు తెరాస విద్యార్థి విభాగం నాయకులు.
ఒడిశా వలసకూలీలకు నిత్యాసరాల పంపిణీ