తెలంగాణ

telangana

విమానాశ్రయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

శంషాబాద్ విమానాశ్రయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎంఆర్ సంస్థ సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దాదాపు 1,000 మొక్కలను నాటారు. భద్రత విభాగం సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

By

Published : Sep 8, 2020, 6:22 PM IST

Published : Sep 8, 2020, 6:22 PM IST

విమానాశ్రయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
విమానాశ్రయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జీఎంఆర్ సంస్థ సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దాదాపు 1,000 మొక్కలను నాటారు. భద్రత విభాగం సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి మొక్కను నాటారు. శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న పచ్చదనం దేశంలోని ఏ విమానాశ్రయంలో కూడా లేదని కొనియాడారు. పచ్చదనం పెంచడం కోసం ఈరోజు జీఎంఆర్ సంస్థ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details