తెలంగాణ

telangana

ETV Bharat / state

Tamilisai: గిరిజనులతో కలిసి టీకా వేయించుకోనున్న గవర్నర్‌ - గవర్నర్​ తమిళిసై తాజా వార్తలు

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ గిరిజనులతో కలిసి కరోనా వ్యాక్సిన్​ వేయించుకోనున్నారు. రేపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రెండో డోసు తీసుకోనున్నారు.

Tamilisai
గవర్నర్‌, తమిళిసై

By

Published : Jul 10, 2021, 5:46 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసీ తండాలో పర్యటించనున్నారు. గిరిజనుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గిరిజనులతో కలిసి గవర్నర్​ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కరోనా వ్యాక్సిన్ పట్ల గిరిజనుల్లో ఉన్న అపోహలు తొలగించటంతోపాటు వంద శాతం వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా తమిళిసై గిరిజనులతో పాటు టీకా తీసుకుంటారు.

గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గవర్నర్ గతంలోనే పిలుపునిచ్చారు. ఈ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు గవర్నర్ కేసీ తండాలో పర్యటించనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏప్రిల్​ 2న కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరిలోని రాజీవ్​గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో తమిళిసై వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఇదీ చదవండి:ETALA: 'దొంగ ఓట్లు నమోదు చేసి నన్ను ఓడించేందుకు కుట్ర'

ABOUT THE AUTHOR

...view details