రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని సింగరేణి ఎంప్లాయిస్ కాలనీలో 2007లో 200 గజాల ప్లాటును కొత్తపేటకు చెందిన ఫణీంద్ర కొనుగోలు చేశాడు. కష్టపడి కొన్న ప్లాటును ఇప్పుడు ప్రభుత్వమే కబ్జా చేసిందని, సదరు ప్లాట్‌లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను కట్టారని వాపోయాడు. రెండేళ్ల క్రితం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను ఫణీంద్ర అడ్డుకోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు.
2019లో మళ్లీ పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఫణీంద్రకు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకుని బాధితుడు ప్లాట్‌కు వెళ్లేసరికి అప్పటికే ట్యాంక్ నిర్మాణం జరిగిపోయింది. ఈ అంశంపై స్థానిక సర్పంచ్‌ను నిలదీయగా తనకు తెలియదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడగాలని చెప్పారు.
దిక్కుతోచని స్థితి...