రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సాహెబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో మూడు రోజుల క్రితం రాత్రి డ్రైనేజీ పనుల నిమిత్తం అందులోకి దిగి మరణించిన కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సర్కార్ తరఫున ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ విజయలక్ష్మి.. బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చెక్ అందించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి శివ, అంతయ్య కుటుంబాలకు రెండు డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల చొప్పున ఇస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశామని... సదురు కాంట్రాక్టర్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తాను చదువుకున్నానని... తనకు ఎవరూ లేరని ప్రభుత్వం స్పందించి ఉద్యోగం ఇప్పించాలని శివ భార్య కోరారు. అంతయ్య భార్యకు చెక్ అందజేసినప్పటికీ తన భర్త మృతదేహం ఇప్పించాలని ప్రాధేపడ్డారు. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.