ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వ్యవసాయ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం విమర్శించారు. ఫార్మా భూ నిర్వాసితులకు అండగా ఉంటామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సాగర్ రహదారిపై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు.
'ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది' - rangareddy district latest news
ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వం పచ్చని పంట పొలాల్లో చిచ్చు పెడుతుందని తెజస అధ్యక్షులు కోదండరాం మండిపడ్డారు. ఫార్మా భూ నిర్వాసితులకు అండగా ఉంటామని తెలిపారు.
ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరికాదని కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే భూ సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభీష్టం మేరకు భూములు తీసుకోవాలని సూచించారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న రైతులు, నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, భూసేకరణ చట్టం ప్రకారం భూములను తీసుకోవడం లేదని ఆరోపించారు. విషపూరిత ఫార్మా కంపెనీల పేరుతో పచ్చని పంట పొలాల్లో చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని.. భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి.. మరోసారి భారీ వర్షసూచన.. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు