తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.14.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం.. నలుగురి అరెస్ట్​ - dri

శంషాబాద్​ మండలం రావిరాలలోని ప్రత్యేక ఆర్థిక మండలిలోని గోదాంల నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.14.87 కోట్లు విలువైన.. 21 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు ఆభరణాలు, 491 కిలోల విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్​ చేశారు.

రూ.14.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

By

Published : May 7, 2019, 11:31 PM IST

రూ.14.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్ మండలం​ రావిరాలలో భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారం నిర్వహిస్తోన్న ఓ సంస్థకు చెందిన గోదాంలు శంషాబాద్​లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 3, 4, 5 తేదీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5.45 కోట్ల విలువైన 19 కిలోల బంగారం, రెండు కిలోల విలువైన రాళ్లు ఎగుమతి చేసినట్లు పత్రాల్లో పేర్కొన్నా.. కేవలం 565 గ్రాముల బంగారం, 20.85 కిలోల రాళ్లు మాత్రమే ఎగుమతి చేసినట్లు గుర్తించారు.
అనంతర తనిఖీల్లో 21 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు ఆభరణాలు, 491 కిలోల విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.14.87 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం వ్యాపారి 1100 కిలోల పసిడిని దారి మళ్లించినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఈ కేసులో నలుగురిని డీఆర్​ఐ అధికారులు అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details