Theft in House: నగరంలో దోపీడి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి బంగారు, వెండి, నగదును అపహరించారు. మనవడి పుట్టినరోజుకని వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దుండగులు. ఉదయాన్నే తిరిగొచ్చిన కుటుంబసభ్యులకు ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా చోరీ హైదరాబాద్‌లోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో జరిగింది.
theft in yellammabanda: నగరంలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో నివసించే పద్మ ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మనవడి పుట్టిన రోజుకని శుక్రవారం మెహదీపట్నంలో ఉండే పెద్దకూతురు ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో పెళ్లి కోసం దాచిన 8 తులాల బంగారు, 30 తులాల వెండి, రూ.20 వేలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు పద్మ పోలీసుల ఎదుట వాపోయింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఫ్రిడ్జ్‌లో పాలను వేడి చేసుకుని తాగి.. మరీ ఇంట్లోని సొమ్మును ఎత్తుకెళ్లారని బాధితురాలి బంధువు మహేశ్ తెలిపారు.