సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో నివాసముండే సందీప్ కుమార్ పోచంపల్లి మండలం దేశ్మూఖ్లోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న తన స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపురంలోని చెరువుకు ఈతకు వెళ్లారు. సందీప్‌కు ఈత రాకపోవడం వల్ల గల్లంతయ్యాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలించలేదు.
పిగ్లీపురంలో ఈతకు వెళ్లి చనిపోయిన విద్యార్థి మృతదేహం వెలికితీత - enjineering student
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపురం చెరువులో పడి నిన్న చనిపోయిన యువకుని మృతదేహాన్ని వెలికితీశారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళఅబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో సందీప్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్