హైదరాబాద్ శివారు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. ధూల్‌పేట్ గంగాభౌలికి చెందిన 22 ఏళ్ల పవన్ సింగ్ మరో ముగ్గురితో కలిసి నిన్న సాయంత్రం జల్పల్లి చెరువుకు చేరి ఈతకొట్టారు. ఆ సందర్భంలో పవన్‌సింగ్ లోతుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు.
ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు - hyderabad latest news
నలుగురు కలిసి ఈతకు వెళ్లారు.. అందులో ఓ యువకుడు తిరిగి రాలేదు.. లోతుకు వెళ్లి మునిగిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జల్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
![ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు Go swimming and died at jalpallu late at rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6429342-457-6429342-1584361215024.jpg)
ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు
సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని గోషామహల్ కార్పొరేటర్ ముఖేేశ్ సింగ్ సందర్శించి మృతుడి బంధువులను ఓదార్చారు.
ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు చేరాడు
ఇదీ చూడండి :తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో మళ్లీ లొల్లి