తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ క్లినిక్​లో యువతికి అబార్షన్... పరారీలో వైద్యుడు - rangareddy

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఓ ప్రైవేటు క్లినిక్​లో పెళ్లికాని యువతికి అబార్షన్​ చేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి.. వైద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప వైద్యాధికారి తెలిపారు.​

నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్​... వైద్యుడు పరార్​

By

Published : May 2, 2019, 6:39 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఓ ప్రైవేట్​ క్లినిక్​లో కేశంపేటకు చెందిన 18 ఏళ్ల యువతికి నిబంధనలకు విరుద్ధంగా ఓ వైద్యుడు అబార్షన్​ చేశారు. పెళ్లి కాని యువతికి ప్రియుడే అబార్షన్ ​చేయించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధికారి చందూలాల్​ క్లినిక్​ను తనిఖీచేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి క్లినిక్​ను సీజ్​ చేయనున్నట్లు తెలిపారు. వైద్యుడు, యువతి పరారీలో ఉన్నారని... వైద్యునిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్​... వైద్యుడు పరార్​

ABOUT THE AUTHOR

...view details