రంగారెడ్డి జిల్లా మాదాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్, మియాపూర్ డివిజన్లు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. మంగళవారం జరగనున్న పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మియాపూర్‌లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్‌ను ఐఏఎస్ అధికారిణి ప్రీతి మీనన్ సందర్శించారు. అనంతరం పలు డివిజన్లలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లాలోని డివిజన్ల పోలింగ్‌కు రంగం సిద్ధం... - ghmc election polling arrangements
బల్దియా పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మాదాపూర్, మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో పోలింగ్ ఏర్పాట్లను ఐఏఎస్ అధికారిణి ప్రీతి మీనన్ పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లాలో పోలింగ్‌కు రంగం సిద్ధం...
పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, సామగ్రిని డీఆర్సీ సెంటర్లో భద్రపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా డివిజన్లలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి :లబ్... డబ్... లబ్... డబ్... కేవలం 24 గంటలే!