రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ సమీపంలో లక్ష్య సాధన ఫౌండేషన్లో కార్తిక పౌర్ణమి సందర్భంగా గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. కలికాలంలో అనేక మానవజాతి నాశనకరమైన రోగాలు సంభవించాయని, ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వ్యాధి విలయతాండవం చేస్తుండగా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని మొక్కుతూ ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు వేద బ్రహ్మ శ్రీధరాచార్యులు పేర్కొన్నారు.
లక్ష్య సాధన ఫౌండేషన్లో గాయత్రీ మహా యజ్ఞం - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా చిలుకూరు సమీపంలోని లక్ష్య సాధన ఫౌండేషన్లో గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. సమాజహితం కోసం ఈ యజ్ఞం చేస్తున్నట్లు వేద బ్రహ్మ శ్రీధరాచార్యులు పేర్కొన్నారు. వేదాలు పుట్టిన భారతదేశంలో కరోనా వైరస్ లాంటి మహమ్మారి.. ప్రజలను పీడించడం బాధాకరమని వెల్లడించారు. వీటన్నింటి నుంచి ప్రజలను రక్షించాలని గాయత్రీ యజ్ఞం చేస్తున్నట్లు తెలిపారు.
లక్ష్య సాధన ఫౌండేషన్లో గాయత్రీ మహా యజ్ఞం
ప్రతి పౌర్ణమికి "లోకాః సమస్తాః సుఖినోభవంతు" అనే సూక్తిని నిజం చేస్తూ ప్రపంచ శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహించుకుందామని వేద బ్రహ్మ కోరారు.
ఇదీ చదవండి:గౌతమేశ్వరస్వామి ఆలయానికి కార్తిక శోభ..