తెలంగాణ

telangana

ETV Bharat / state

గంజాయి గ్యాంగ్ ఆగడాలు.. బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ దాడి - Ganjai gang hustle in Mylardevpally

Ganja Gang Attack a Minor Boy: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ హల్​చల్ చేసింది. అంతటితో ఆగకుండా ఓ మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి చిత్రహింసలకు గురిచేశారు.

Rangareddy district
Rangareddy district

By

Published : Mar 2, 2023, 2:01 PM IST

Ganja Gang Attack a Minor Boy: హైదరాబాద్​లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా వాటి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల గంజాయి సేవించే వారు గ్యాంగ్​లుగా ఏర్పడి నానాహంగామా సృష్టిస్తున్నారు. మత్తులో తూగుతూ రోడ్లమీద భయాందోళనలకు దిగుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా కొందరు వ్యక్తులు దాడికి దిగారు. కిరాణా షాప్​లో కూర్చున్న బాధిత బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు గ్యాంగ్ సభ్యులు తీసుకెళ్లారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వాలంటూ బాధితుడిని బట్టలు విప్పి కర్రలతో, బెల్ట్​తో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు గురిచేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకున్నాక.. ఒంటిపై గాయాలు చూసిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న అనంతరం.. పిల్లాడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అబ్బూ, సమీర్‌, మహమ్మద్ సైఫ్​తో పాటు, మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ‘‘నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశామని గ్యాంగ్‌ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మైలార్​దేవ్​పల్లి పోలీసులు దర్యాప్తు చేప్టటారు.

"నా కుమారుడిని కిరాణ దుకాణంలో ఉన్నవారిని తీసుకెళ్లి కొట్టారు. డబ్బులు కావాలని బెదిరించారు. అబ్బూ, సమీర్, మహమ్మద్ సైఫ్​తో పాటు మరో ఐదుగురు దాడి చేశారు.ఇప్పటికే ఇద్దరిని హత్యచేశామని గ్యాంగ్ సభ్యులు బెదిరించారు. వారు గంజాయి మత్తుల్లో దాడులకు పాల్పడుతున్నారు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు వారిని శిక్షించాలని కోరుతున్నాం."-బాధిత బాలుడి, తల్లిదండ్రులు

నిన్న ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో ఇద్దరు మైనర్​లు గంజాయి, మద్యం మత్తులో దారుణాలకు తెగబడ్డారు. ద్విచక్ర వాహనంపై తిరుగతూ చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వీరిని అడ్డుకుబోయిన ఇద్దరు వాచ్​మెన్​లను దారుణంగా హతమార్చారు. మొదట అమరావతి రోడ్డులో ఉన్న ద్విచక్ర వాహనాల దుకాణానికి కాపలాగా విశ్రాంత కానిస్టేబుల్‌ కృపానిధి ఉన్నారు ఇద్దరు యువకుల్లో ఒకరు కృపానిధి వద్దకు వెళ్లగా.. ఆయన మీరెవరని ప్రశ్నించారు. వెంటనే నిందితులు గడ్డపారతో కృపానిధి తలపై కొట్టారు. దీంతో ఆయన కుర్చీలో కూర్చుని, అలాగే ప్రాణాలు విడిచారు. అక్కడి నుంచి వారు అరండల్‌పేట పదోలైనుకు చేరుకున్నారు. అక్కడే లిక్కర్‌స్టోర్‌కు కాపలాగా ఉన్న బత్తుల సాంబశివరావుపై దాడిచేసి హతమార్చారు. షట్టర్‌ తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వాచ్‌మన్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, నగదుతో ఉడాయించారు.

ఇవీ చదవండి:ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రూ.86లక్షల మోసం! షారుక్​ భార్య గౌరీ ఖాన్​పై కేసు

ABOUT THE AUTHOR

...view details