ఈ నెల 27వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో పండ్ల మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ఇక్కడికి తరలించనున్నారు.
27 నుంచి కొహెడలోనే పండ్ల మార్కెట్: సబితా ఇంద్రారెడ్డి - mla manchireddy kishan reddy
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 27వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో పండ్ల మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
27 నుంచి కోహెడలో పండ్ల మార్కెట్: సబితాఇంద్రారెడ్డి
ఈ విషయమై ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్‌నర్సింహగౌడ్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 26 వరకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ మూసివేయాలని నిర్ణయించారు.