రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దసరా వేళ కొత్త తాత్కాలిక మార్కెట్ (Fruit market) ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు (Batasingaram Logistics Park)లో పండ్ల మార్కెట్ (Fruit market) ప్రారంభం అయ్యింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ (Fruit market) తరలించి బాటసింగారం (Batasingaram)లో మార్కెట్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy), మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి (Marketing Director Lakshmibai), వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ ప్రారంభం - తెలంగాణ వార్తలు
12:15 October 15
బాటసింగారంలో పండ్ల మార్కెట్
పండ్ల క్రయ, విక్రయాలు ప్రారంభించిన మంత్రి... ఆపిల్, సంత్ర, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల తొలి వేలం ప్రక్రియను పరిశీలించారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమీషన్ ఏజెంట్లు సహకరించాలని మంత్రి సూచించారు. వ్యాపారులంతా సహకరిస్తే వీలైనంత త్వరలోనే కోహెడలో శ్వాశ్వత ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ నిర్మాణం కార్యరూపం దాలుస్తుందని ప్రకటించారు. ఈలోగా పండ్ల క్రయ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే తొలగించేందుకు సిద్ధమని మంత్రి చెప్పారు. ఏ ఒక్క వ్యాపారి అనుమానం, అపోహలకు గురికావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Gaddiannaram Fruit Market: దశాబ్దాల గడ్డి అన్నారం మార్కెట్ చరిత్రకు తెర
Gaddi annaram fruit market: బాటసింగారం లాజిస్టిక్ పార్కులో పండ్ల మార్కెట్!