ఎల్బీనగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
ఎల్బీనగర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ - మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ
మహాశివరాత్రి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున నాలుగు గంటల నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ పార్వతి రాజారాజేశ్వరి స్వామి ఆలయ ఛైర్మన్ గుంటి లక్ష్మణ్ అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎల్బీనగర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
రేపు ఉదయం వరకూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయని అధికారులు తెలిపారు. దాదాపు 10 వేలమంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు శేఖర్ అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.