గడ్డిఅన్నారం వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్ నర్సింహ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కొవిడ్-19 కరోనా వ్యాప్తి కారణంగా ఆ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రి 2000 మంది సిబ్బందికి పండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. మార్కెట్ తరపున పంపిణీ చేయాలని తీర్మానం చేశారు.
త్వరలో గాంధీ ఆస్పత్రిలో 2000 మంది సిబ్బందికి పండ్లు - గడ్డిఅన్నారం వ్యవసాయమార్కెట్ తాజా వార్తలు
గడ్డి అన్నారం వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమళ్ల రామ్ నర్సింహ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సుమారు 2000 మంది సిబ్బందికి పండ్లను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో గాంధీ ఆస్పత్రిలో 2000 మంది సిబ్బందికి పండ్లు
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ సునంద రెడ్డి, వైస్ ఛైర్మన్ కందడా ముత్యం రెడ్డి, మార్కెట్ సెక్రెటరీ ఇంద్రపాలీ వెంకటేశం, సభ్యులు కిషన్ గౌడ్, అడల రమేష్, సుంకోజు కృష్ణమా చారి, పన్నాల కొండల్ రెడ్డి, షాగా రవీందర్, మహ్మద్ ఇబ్రహీం, సింగి రెడ్డి రామ్ రెడ్డి, సిబ్బంది మామిడ్ల రవికుమార్, చిలుక నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత
TAGGED:
ఎల్బీనగర్ తాజా వార్తలు